పుడమి ప్రేమ

Image by Peggychoucair from Pixabay
 

ధరణెంత గొప్పది
అమ్మకడుపులో నుండి
బయటకొచ్చింది మొదలు
మనల్ని తన ఎదపై ఆడిస్తూ
భారమనేదెంతైనా ఓర్పుతో లాలిస్తది
అమ్మ ప్రేమలా ఎప్పుడూ
మనకేమి కావాలంటే అందిస్తూ
తన తనువులోని అణువణువును మనకే ధారపోస్తూ
జీవన గమనాన్నో బృందావనంలా మార్చేస్తూ
మనమేమిచ్చినా తిరిగి అంతకంటే పదింతలిస్తూ
మంచి చేస్తే మంచిని
చెడును చేస్తే  చెడునే ఇచ్చే నిస్వార్ధం పుడమి సొంతం
అవని అంటే అమ్మ
తన గర్భంలో దాచుకున్న సర్వాన్ని మన కోసం
తానెంత నలిగిపోతున్న
మనకు నవ్వుల పువ్వుల్ని
పూయించే సహనమూర్తి నేలమ్మ

అమ్మ తొమ్మిది నెలలు మోసి ముద్దుమురిపాలను పంచినా
నిను లాలించిన పాలించిన              
భూతల్లి ఒడిలోనే
నీ తల్లి నిన్ను విడిచి వెళ్లిన
నీకెప్పటికి నీలో
జీవమున్నంతవరకు
శాశ్వతంగా మనకు తోడు నేలమ్మ
కన్నతల్లి కడుపునుండి జన్మమెత్తినా
జన్మంతా నీను మోసి 
తనువులోని జీవం పోయిన
తన కడుపులో దాచుకునే అందరి తల్లి నేలమ్మా
............................................సి. శేఖర్ (సియస్సార్),
పాలమూరు,
90104 80557.

Post a Comment

0 Comments