వలసకూలీ ఆక్రంధన

Daily Labour Worker:వలసకూలీ ఆక్రంధన_harshanews.com
వలసకూలీ ఆక్రంధన


బతుకుబండి  సాగక
మెతుకు కరువై 
మోత బరువై
ఆలుపిల్లలొకవైపు
అప్పులతిప్పలొకవైపు
ముసలి అమ్మనాన్నల్ని
పసివయసు పిల్లల్నొదిలి
బందుమిత్రులనంతొదిలి
ఊరిపొలిమేరలనొదిలి
వలసకూలీ అవతారమెత్తి
బతుదెరువుకు బయలువెల్లిన
మనుషులను కాలమే కాటేస్తే
ఎక్కడెక్కడో బతుకుతున్న
వలసకూలీల బాధలెవరికెరుక
కడుపుకట్టుకు పనిచేస్తూ
పైసపైసా కూడబెట్టి 
భవిష్యత్తుకు బాటలేస్తే
పిడుగులాంటి కాలమొక్కటి
కాలనాగై తరుముతుంటే
ఇల్లుజేర నడకసాగుతూ
ఎర్రటెండల పగిలిన పాదాలసాక్షిగా
మధ్యలోనే పానమొదలిన
దిక్కులేని దీనులైరి
పిల్లలంతా అనాథలైరి
మనిషి ముట్టని రోగమొచ్చి
కడచూపుకూడ నోచుకోని
వలసబతుకుల వర్ణచిత్రం వర్ణాణతీతం
...........................................................
సి. శేఖర్ (సియస్సార్)
90104 80557.

Post a Comment

0 Comments