అంజయ్య కుటుంబానికి అండగా ఉంటాం..

Minister KTR:అంజయ్య కుటుంబానికి అండగా ఉంటాం.._harshanews.com
అంజయ్య కుటుంబసభ్యులతో మంత్రి కేటీఆర్​


  • మంత్రి కేటీఆర్​ హామీ
  • కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

హైదరాబాద్​: కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్​ కలెక్టర్​ అంజయ్య కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్​ హామీనిచ్చారు. మంగళవారం అంజయ్య కుటుంబసభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ..  అంజయ్య విధుల పట్ల నిబద్ధతతో ఉన్నారని, సమర్థవంతమైన అధికారి అని గుర్తుచేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీనిచ్చారు. కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా మేమున్నామనే విషయాన్ని మరిచిపోవద్దని మంత్రి భరోసానిచ్చారు. 


Post a Comment

0 Comments