జీవ..నిర్జీవ యుద్ధంవిధాత అందమైన సృష్టిపై
వంకర టింకర గీత 
గీయడానికి ప్రయత్నిస్తూ
మేము కష్టపడి మలుచుకున్న
పొదరిల్లుపై విరుచుకునిపడి
విధ్వంసం సృష్టిస్తుంది..

స్వేచ్చాఊపిరినాడకుండా
బానిససంకెళ్లతో బంధిస్తూ 
మరోవైపు కలల గూటిని 
మృత్యుకాళ్ళతో చిదిమేసి
కరాళనృత్యమాడుతుంది..

ఈ ఊపిరి ఎందుకో నేడు
విషవాయువులా చేదుగా అన్పిస్తే
గుండె ఎందుకో తొలిసారి 
భయంతో గుబగుబలాడితే
ఈ లోకమెందుకో శోకసంద్రంలో
మునిగినట్టుంది..

ఈ జీవావరణంలో తన ఉనికిని
చాటిచెప్పడానికి ఏదో నిర్జీవి 
నిర్దయగా జెండా పాతడానికి ప్రయత్నిస్తుంది
ఒక మహమ్మారి చిన్న నిర్లక్ష్యంపై 
మూకుమ్మడిగా దాడి చేయడానికి 
ప్రణాళికలు రచిస్తుంది

మాదంటూ ఓ రోజు
ఎంతో దూరంలో లేదు
నేను అనే అహంభావంతో
విర్రవీగే నీ నడుము విరగడానికి
ఇట్టే సమయం పట్టదు..

ఇక కాచుకో..!
ఆత్మవిశ్వాసాన్ని 
గుండెల నిండా నింపుకుని
ధైర్యసాహసాల్ని ప్రతికణం 
నిండా ఒంపుకుని
స్యానిటాయిజర్ లేపనం రాసుకుని
మాస్కు కవచమేసుకుని
పిపిటి కవచకుండలాలు ధరించి
వ్యాక్సిన్ అస్త్రంతో నీపై దండయాత్రకై
మేము బయల్దేరివస్తున్నాము..

......................................
సర్ఫరాజ్ అన్వర్.. 
94409 81198
రాజేంద్ర నగర్, హైదరాబాద్

Post a Comment

0 Comments