"లైఫ్ ఈస్ బ్యూటిఫుల్"

life is beautiful_harshanews.com


ప్రకృతి అందాలు చూస్తే బ్యూటిఫుల్
ఆనందాల అందాలు చూస్తే బ్యూటిఫుల్

జీవితాన్ని అనుభవిస్తే బ్యూటిఫుల్
ఒడిదుడుకులను స్మరించినా బ్యూటిఫుల్

చదువుందని గర్వపడినా బ్యూటిఫుల్
చదువుకు తగ్గ సంస్కారం బ్యూటిఫుల్

గొప్ప మనసుకి మంచితనం బ్యూటిఫుల్
సిరి సంపదలతో కాదు లైఫ్ బ్యూటిఫుల్

కాగితంపై అక్షరాల నడక బ్యూటిఫుల్
అక్షరానికి పదును పెట్టె కలం బ్యూటిఫుల్

హరివిల్లు అందాలు నింగికి బ్యూటిఫుల్
లైఫ్ని రంగులతో రంగులద్దటం బ్యూటిఫుల్

భూమిని చీల్చుకుని వచ్చే మొలక బ్యూటిఫుల్
భూదేవి చివురమ్మకు నేర్పిన ఓర్పు బ్యూటిఫుల్

మంచి పని,మంచి స్నేహం,మంచి ఆశయం,
మంచి ఆలోచనలు లైఫ్ కి బ్యూటిఫుల్

జీవితంలో మంచి అవకాశం రావటం అరుదు
అవకాశాన్ని ఆస్వాదించటం బ్యూటిఫుల్

అక్షరాలు దిద్దటం కష్టముగా ఉంటుంది.. కానీ
దాని ఫలం అందుకుంటే కాదా..బ్యూటిఫుల్

ధనమేరా... అన్నిటికీ మూలం అంటారు...
ఆ ధనాన్ని కలర్ఫుల్ ఆదరిస్తేనే బ్యూటిఫుల్

సీతాకొక చిలుక సింగారం చూస్తే బ్యూటిఫుల్
రంగుల పువ్వుల కలయిక చూస్తే బ్యూటిఫుల్

మయూరాల వయ్యారాల నాట్యం బ్యూటిఫుల్
కోకిలమ్మ పాట తోడైతే మరింత బ్యూటిఫుల్

అమ్మ చేతి గోరుముద్ద, లాలి పాట బ్యూటిఫుల్
నాన్న నేర్పే వినయం, విధేయత బ్యూటిఫుల్

స్నేహంలోని నమ్మకం, బంధాలలోని అనుబంధం
జీవితంలోని అనుభవం, ఆనందం వెరసి...

"లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యూటీ..."

............................................
టి. వి. శిరీష
(కవియిత్రి )
96184 94909
                                                          

Post a Comment

0 Comments