నాణ్యత పెంచడమే లక్ష్యం

నాణ్యత పెంచడమే లక్ష్యం_harshanews.com
  • ప్రైవేటుకు ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాలు
  • ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ చైర్మన్ మన్మోహన్

హైదరాబాద్​: అంగన్ వాడీ కేంద్రాల్లో నాణ్యత పెంచడమే తమ లక్ష్యమని ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ చైర్మన్ మన్మోహన్ అన్నారు. పోషకాహార వారోత్సవాల్లో భాగంగా అంబర్ పేట మండలపరిధిలోని ఎంసీహెచ్ క్వార్టర్స్‌ అంగన్‌వాడీ సెంటర్‌లో సమతుల ఆహారంపై వంటల పోటీలు, వాక్చాతుర్యం పోటీలను యునైటెడ్ వే సహాయ సహకారంతో ఇండియన్ లిటరసి ప్రాజెక్ట్ (ఐఎల్‌పీ) సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.

ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ చైర్మన్ మన్మోహన్ మాట్లాడుతూ.. ఆన్ లైన్‌లో న్యూట్రిషన్ మీద అవగాహన కల్పించడమే కాకుండా అంగన్‌వాడీ ప్రీ స్కూల్ పిల్లలకు పాఠాలు  డీడబ్ల్యూసీడీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్)  పాఠ్యాంశాలను చెప్పడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు  అంబర్‌పేట్‌లోని 17 అంగన్ వాడీ కేంద్రాలను మోడల్ సెంటర్లుగా అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నామన్నారు. అంగన్ వాడీ టీచర్ల నాణ్యతను పెంపొందించాలని వారికి అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి అంగన్ వాడీ సెంటర్ కు రంగులను వేయించి లర్నింగ్ మెటీరియల్స్ ఇచ్చి, ఆన్‌లైన్‌లోనే గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ వారికున్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు. 315 మంది అంగన్‌వాడీ  తల్లులు వంటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ లో 100 మంది అంగన్ వాడీ కేంద్రాల వర్కర్లకు ఎన్-జాయ్ లర్నింగ్ కిట్ (బోధగురు కిట్)ను ఉచితంగా అందించారు.

జాతీయ పోషకాహార సంస్థ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి  మాట్లాడుతూ పోషకాహార మాసం ముఖ్య ఉద్దేశం.. ప్రతి మనిషికి న్యూట్రిషియన్స్ మీద అవగాహన కల్పించడమేనని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలని, అన్ని రకాల పోషకాలను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో డీడబ్యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ అకేశ్వర్ రావు, సీడీపీఓ జోష్న, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, రజిత (జీహెచ్ఎంసీ) పాల్గొన్నారు.

Post a Comment

0 Comments